22 July, 2026 | 7:30 PM

విజయ రమణారావుకు క్యాబినెట్ మంత్రి హోదాపై సంబరాలు

22-07-2026 06:56 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మంత్రి హోదా కల్పించడంపై సుల్తానాబాద్ లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు,బుధవారం చింతకుంటరమణారావును సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ, మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్ సాయి మహేందర్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రవీందర్, కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న),  వేగోళం అబ్బయ్య, అల్లంకి శ్రీనివాస్, కుమార్ కిషోర్, పెగడ పరశురాములుతో పాటు పలువురు కలసి పుష్పగుచ్చం అందజేసి,శాలువా కప్పి ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.