22 July, 2026 | 7:27 PM

Breaking News

చోరీ కేసు చేదించి బాధితులకు న్యాయం చేయాలి   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల పరిశీలన   •   సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోండి   •   ధర్మేంద్ర ప్రధాన్ కాదు... మోదీ రాజీనామా చేయాలి   •   వర్షవాస్ కమిటీ అధ్యక్షుడిగా శ్యామ్‌ రావు ​ఏకగ్రీవం   •   వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పతాక స్వీకారోత్సవం కార్యక్రమం   •   సర్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన మండల కోఆర్డినేటర్ సురభి రాజేష్   •   ఎవరెస్ట్ శిఖరంపై జెండా ఎగరాలి: కలెక్టర్ రాజర్శి షా   •   విజయ రమణారావుకు క్యాబినెట్ మంత్రి హోదాపై సంబరాలు   •   రాష్ట్ర బాధ్యతలతో సందీప్‌కు సన్మానం   •  

రాష్ట్ర బాధ్యతలతో సందీప్‌కు సన్మానం

22-07-2026 06:53 PM

వాంకిడి,(విజయక్రాంతి): రాష్ట్ర సమతా సైనిక్ దళ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఆసిఫాబాద్ జిల్లా సమతా సైనిక్ దళ్ అధ్యక్షుడు దుర్గం సందీప్‌ను బుధవారం వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్‌లో భారతీయ బౌద్ధ మహాసభ, అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అశోక్ మహుల్కర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి బాధ్యతలు చేపట్టిన సందీప్‌కు అభినందనలు తెలిపారు. సమాజంలో విద్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.