15 June, 2026 | 3:03 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

01-12-2024 12:24 AM

కామారెడ్డి కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, నవంబర్ 30 (విజయక్రాంతి): డిసెంబర్ 1 నుంచి 9వ తేది వరకు జిల్లాలో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో విజయోత్సవాలు అన్ని శాఖల సమన్వ యంతో నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమాల్లో  ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. ఉన్నతా ధికారుల ఆదేశాల మేరకు శాఖపరంగా కార్యక్రమాలు నిర్వహించా లన్నారు. ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాల విజయ గాథలను తెలిపే విధంగా ప్లెక్సీలను ఏర్పాటు  చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, విక్టర్, జిల్లా అటవీశాఖ అధికారిణి నిఖిత, జడ్పీ సీఈవో చందర్‌నాయక్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రావు   పాల్గొన్నారు.