17 April, 2026 | 5:44 PM

సెల్‌ఫోన్ అప్పగింత

29-12-2025 12:00 AM

వాంకిడి, డిసెంబర్ 28 (విజయ క్రాంతి) : వాంకిడి మండల కేంద్రంలోని హనుమాన్ మందిర్ కాలనికి చెందిన కృష్ణ ఇటీవల తన సెల్ఫోన్ను పోగొట్టుకున్నాడు. ఈ విషయమై స్థాని క వాంకిడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ఫోన్ను గుర్తించి ఆదివారం బాధితుడికి అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మహేందర్ మాట్లాడు తూ, మొబైల్ ఫోన్ పోయిన లేదా దొం గిలించబడిన ప్రతి ఒక్కరూ ఆలస్యం చేయకుండా సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేస్తే, పోగొట్టుకున్న సెల్ఫోన్ను గుర్తించి బాధితులకు తిరిగి అప్పగించే అవకాశం ఉంటుందన్నారు. సెల్ఫోన్ను గుర్తించి బాధితుడికి అప్పగించడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ కానిస్టేబుల్ నయీమ్ను ఎస్‌ఐ అభినందించారు.