రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు విద్యార్థి ఎంపిక
కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్28 (విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు నిర్వహించనున్న 69వ ఎస్ జి ఎఫ్ అండర్14 బాల, బాలికల రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు స్థానిక ఆశ్రమ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి ఆత్రం విజయకుమార్ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కనక కర్నూ, పీడీ హీరభాయ్ తెలిపారు. రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన విద్యార్థిని ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్. రమాదేవి, గిరిజన క్రీడల అధికారి మడావి షేకు, పాఠశాల క్రీడల అధికారి బి. వెంకటేష్, ఏసీఎంఓ ఉద్దవ్, జీసీడీఓ శకుంతల, ఏటీడీఓ శివకృష్ణ, పీడీ మధుసూదన్, హెచ్డబ్ల్యూఓ మధుకర్, కిషన్ యాగేష్, కిరణ్ చంద్రశేఖర్, కోచ్ రాకేష్, అలాగే పాఠశాల అధ్యాపక బృందం హృదయపూర్వకంగా అభినందించారు.






