జన గణన–2027లో భాగంగా గ్రామ సందర్శన
06-04-2026 06:54 PM
సుల్తానాబాద్,(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామి గ్రామంలో సోమవారం జన గణన–2027 కార్యక్రమం సందర్భంగా ఎంపిడిఓ దివ్యదర్శనరావు, సెన్సస్ టెక్నికల్ అసిస్టెంట్ గ్రామాన్ని సందర్శించారు. హౌస్ లిస్టింగ్ నిర్వహణపై గ్రామస్థులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉప్పు లక్ష్మి ఎంపిడిఓ దివ్యదర్శనరావును శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.




