calender_icon.png 18 November, 2025 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో అభివృద్ధి పనులకు కేంద్రం కృషి

18-11-2025 12:10:42 AM

పీఎం జన్మన్ యోజన పథకం కింద హాస్టల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, నవంబర్ 17 (విజయక్రాం తి):  ఆదివాసీ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని ఎంపీ గోడం నగేష్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ రూరల్ మండలం పోతాగూడ గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సాటిలైట్ సెంటర్ లో ప్రధానమంత్రి జన్ మన్ యోజన పథకం కింద రూ. 2.75 కోట్ల తో నూతనంగా నిర్మించే హాస్టల్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి భూమి పూజ చేశారు. 

ముందుగా పాఠశాలకు వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలకు విద్యార్థు లు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న పీఎం జన్మన్ యోజన పథకం ద్వారా లో పలు గిరిజన గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రధానంగా ప్రభుత్వ విద్య విధానం బలోపేతానికి కేంద్రం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజే పీ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.