18-11-2025 12:09:02 AM
మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్/భైంసా, నవంబర్ 17 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతు లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఈనెల 17వ తేదీన బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ కు రానున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న తెలిపారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చి రైతులతో మాట్లాడి, ఇబ్బందులను తెలుసుకుంటారన్నారు.
అనంతరం సీసీఐ అధికా రులతో సైతం సమావేశం అవుతారని తెలిపారు. సోమవారం ఆదిలాబాద్‌లోని మార్కె ట్ యార్డ్ లో కొనుగోళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ... గత కొన్ని నెలల క్రితం కురిసిన భారీ వర్షాలతో పాటు ప్రస్తుత చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున పంటల్లో తేమశాతం ఎక్కువగా ఉందన్నారు. కావున తేమ శాతం, డ్యామేజ్ నిబంధనలకు సంబంధం లేకుండా తడిసిన పత్తి, సోయా పంటను సైతం రైతుల నుండి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, రైతులు ఉన్నారు. అలాగే పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో మంగళవారం భైంసాకి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు వస్తున్నారని వస్తున్నార ని బిఆర్‌ఎస్ ముధోల్ సమన్వయ నాయకులు విలాస్ గాదేవర్, రమాదేవి తెలిపారు.