18-11-2025 12:12:13 AM
నిర్మల్, నవంబర్ ౧౭ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ క్యాంప్ కార్యా లయ భవన నిర్మాణానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు భూమి పూజ చేసారు. రూ. 8.10 కోట్లతో 5.38 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే భవన నిర్మాణానికి భూమి పూజ చేసారు. అనంతరం భవన నిర్మాణానికి సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించి, పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, మాజీ ఉమ్మడి నిర్మల్ మండల పరిషత్ అధ్యక్షులు వి సత్యనారాయణ గౌడ్, జిల్లా ఉపాధ్య క్షుడు సత్యం చంద్రకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే విలాస్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, ఆఫీస్ సెక్రటరీ రాచకొండ సాగర్, ట్రెజరర్ అల్లం భాస్కర్, బీజేవై ఎం జిల్లా అధ్యక్షులు ఒడిసెల అర్జున్, నాయకులు తాజామాజీ కౌన్సిలర్లు సాదం అరవిం ద్, బిట్లింగ్ నవీన్, నరేందర్, శంకర్ పతి, శ్రీరామోజు నరేష్, జప ప్రసాద్, జుట్టు దినే ష్, సాత్విక్, రంజిత్ పాల్గొన్నారు.