02-11-2025 06:45:37 PM
ఘనంగా డివైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవాలు..
కట్ట లింగస్వామి-డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి..
మునుగోడు (విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను నిర్వీర్యం చేస్తూ, భవిష్యత్తుకు దూరం చేస్తున్నాయని డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు. మండల కేంద్రంలో డివైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా మండల అధ్యక్షులు బొడ్డుపల్లి నరేష్ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా యువతను పక్కదారి పట్టేటటువంటి నిర్ణయాలలు ప్రభుత్వాలు నెరవేరుస్తున్నాయని మండిపడ్డారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి మోడీ సర్కార్ ఇప్పుడు మాట తప్పి ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ నియమాక పత్రాలను అందజేస్తూ, తామే చేశామన్నట్టుగా కాలయాపన చేస్తూ యువతను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో యువజన సమస్యల మీద నిరంతరం పనిచేస్తూ, దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన యువజన సంఘం డివైఎఫ్ఐ ఎదిగిందని కొనియాడారు. ఏడో తారీఖు వరకు జరిగే డివైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవాలను గ్రామ గ్రామాన జరపాలని పిలుపునిచ్చారు. పాలక ప్రభుత్వాలు యువత పట్ల నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నవీన్, మల్లేష్, విజయ్, రాము, కోటేశ్, మణికంఠ ఉన్నారు.