calender_icon.png 3 November, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యుఎస్ఎఫ్ఐ లో భారీ చేరికలు

02-11-2025 06:40:32 PM

స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదలపై రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపడతాం..

యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి..

హనుమకొండ (విజయక్రాంతి): భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్(యుఎస్ఎఫ్ఐ)లో వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి నాయకులు చుక్క ప్రశాంత్ నాయకత్వంలో పెద్దఎత్తున విద్యార్థులు చేరడం జరిగింది. ఈ చేరికలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎఐకెఎఫ్ జాతీయ కార్యదర్శి మోర్తాల చందర్ రావు, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి హాజరై వారికి కండువాలు కప్పి సంఘంలోకి ఆహ్వానించారు. అనంతరం మోర్తాల చందర్రావు మాట్లాడుతూ విద్యార్థులు నేడు సమాజంలో జరుగుతున్న అనేక అసమాన తలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని  పిలుపునిచ్చారు. అలాగే నేడు సమాజంలో నెలకొన్న అసమానతలను అరికట్టడం కేవలం విద్యార్థుల ఉద్యమాలతోనే సాధ్యమవుతుందని అన్నారు.

విద్యార్థి, రైతు ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని, విద్యార్థి రంగాన్ని పూర్తిగా విస్మరిస్తుందని మండిపడ్డారు. వర్షాల కారణంగా సర్వం కోల్పోయిన రైతాంగానికి ఎకరాన 25 వేల రూపాయలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి మాట్లాడుతూ యుఎస్ఎఫ్ఐ దేశ, రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తుందని, ఆ ఉద్యమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలోని యుఎస్ఎఫ్ఐ ఉద్యమాలకు ఆకర్షితులైన విద్యార్థులు యూఎస్ఎఫ్ఐలో చేరడం సంతోషకరమన్నారు. నేడు దేశంలో రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై సమరశీల పోరాటాల నిర్వహిస్తున్న సంఘముగా యుఎస్ఎఫ్ఐ ముందుకు పోతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలకు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, విద్యారంగానికి మాత్రం ఆచరణలో ఖర్చు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికీ అధికారంలోకి వచ్చి 25 నెలలు గడుస్తున్నా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయకపోగా అడిగిన విద్యాసంస్థలపై విజిలెన్స్ దాడులు చేయడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ 7200 కోట్ల రూపాయలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ పాఠశాలల బకాయిలను విడుదల చేయకపోవడం వలన యజమాన్యాలు విద్యార్థులకు చదువు చెప్పలేక ఇంటికి పంపించే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని గాలికి వదిలేసి కేవలం మాటలకే పరిమితం అవ్వడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేసి యజమాన్యాలతో చర్చలు జరిపి విద్యార్థులు విద్యా నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా రేపు యజమాన్యాలు చేపట్టే బందుకు రాష్ట్రవ్యాప్తంగా భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. చుక్క ప్రశాంత్, కళ్యాణ్ మహేష్,సాయి కృష్ణ, విష్ణుతో పాటు దాదాపు 50 మందికి పైగా విద్యార్థి సంఘాల ప్రతినిధులు చేరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలోతు రాజేష్ నాయక్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆకుల మనోజ్, జయకృష్ణ, హనుమకొండ నగర కార్యదర్శి బాలగోని రాకేష్,చందు తదితరులు పాల్గొన్నారు.