02-11-2025 03:52:01 PM
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీని విమర్శించి మజ్లిస్ పార్టీ ఓట్లు పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సన్నబియ్యం రద్దు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను బెదిరించారని, సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బెదిరింపు రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం అని అడిగారు. కాంగ్రెస్ అమలు చేస్తున్నది ఒకేఒక్క పథకం.. అది ఫ్రీ బస్సు అని, సన్న బియ్యం పథకం కాంగ్రెస్ సర్కార్ ది కాదని ఆరోపించారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే బియ్యం పథకం ఆపిచూడండి అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.
తెలంగాణ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు కేజీ బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.15 ఖర్చు చేస్తే కేంద్రం ప్రభుత్వం రూ.42 ఇస్తుందన్నారు. సన్న బియ్యం పథకం ఎవరిదో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని, దేశవ్యాప్తంగా ఉచిత బియ్యం పథకాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీయే అమలు చేస్తుందని కేంద్రమంత్రి గుర్తు చేశారు. రాబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెప్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేయకపోతే సన్న బియ్యం పథకం అపేస్తామని బెదిరించడం ఎన్నికల నియమావళికి వ్యతిరేకం అని, దీనిపై బీజేపీ తరుపున ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు.