calender_icon.png 2 November, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. సివిల్ కాంట్రాక్టర్‌ అరెస్టు

02-11-2025 04:17:37 PM

హైదరాబాద్: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (HNEW) ఆదివారం డ్రగ్స్ అమ్ముతున్న ఓ సివిల్ కాంట్రాక్టర్‌ను అరెస్టు చేసింది. అతని నుండి 11 గ్రాముల ఎండీఎఏ, 35 గ్రాముల కొకైన్, 5 గ్రాముల ఓజీ ఖుష్ గంజాయి, 15 ఎక్స్టసీ మాత్రలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఎజిజ్ అహ్మద్ (28) అనే వ్యక్తి బెంగళూరులోని ఒక నైజీరియన్ జాతీయుడి నుండి డ్రగ్స్ కొనుగోలు చేసి, ఇక్కడి వినియోగదారులకు విక్రయించడానికి హైదరాబాద్ వస్తున్నాడు. ఒక రహస్య సమాచారం మేరకు అతన్ని హెచ్ఎన్ఈడబ్ల్యూ అధికారులు మసాబ్ ట్యాంక్ వద్ద అదుపులోకి తీసుకొని, అతని నుండి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.