11-09-2024 03:57:09 PM
ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో కేంద్ర బృందం పర్యటిస్తుంది. కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ పరివాహక ప్రాంతాల్లో ఇటీవల వరద ముంపు గురైన పంట పొలాలను, రహదారులను, తెగిన కాలువ కట్టలను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం పరిశీలిస్తున్నారు.ఈ రోజుంత పాలేరు నియోజకవర్గ oలోనే పర్యటించనున్నారు. రేపు ఖమ్మం లోని మున్నేరు వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు. వరదలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర బృందం రాష్ట్రంలో వరద నష్ట్రాన్ని అంచనా వేస్తుంది. వరద బాధితులు, మంత్రులు, అధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది.