11-09-2024 03:22:55 PM
కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గురజాల గ్రామానికి చెందిన రైతు బుధవారం విద్యుత్ షాక్ కు గురై మరణించినట్లు గాంధారి ఎస్సై ఆంజనేయులు తెలిపారు. గురజాల గ్రామానికి చెందిన రాజు (35) ఉదయం తన సొంత పొలంలో పత్తి పంటకు పురుగుల మందు కొడుదామని వెళ్ళగా అక్కడ ట్రాన్స్ఫార్మర్ కు వైరు ఊడిపోవడంతో దానిని కట్టేతో సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు చేతులకు విద్యుత్ వైరు షాకు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నట్లు తెలిపారు మృతుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామాడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ ఐ తెలిపారు.