calender_icon.png 8 October, 2025 | 1:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

08-10-2025 12:18:46 PM

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తున్న కేంద్ర బృందం 

కేంద్ర ప్రభుత్వంతో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు 

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు(heavy rains) రోడ్లు, పంటలు, దెబ్బతిన్న ప్రాంతాలను బుధవారం కేంద్ర బృందం ప్రతినిధులు పరిశీలించారు. జిల్లా లోని భిక్కనూరు మండల కేంద్రంలోని దానమ్మకుంట, మండల కేంద్రంలో ధ్వంసమైన రోడ్లు పరిశీలించారు. అనంతరం అంతంపల్లి గ్రామంలో పర్యటించారు. అంతం పల్లిలో ధ్వంసమైన బీటీ రోడ్లను పరిశీలించారు. జిల్లాలో 30 వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతినగా, చెరువులు కుంటలు తెగిపోయాయి. రోడ్లు కోతకు గురయ్యాయి.

భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి కేంద్ర బృందం ప్రతినిధులు వచ్చారు. వారితో పాటు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్, ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కామారెడ్డి జిల్లాలో కేంద్ర బృందం పరిశీలించుతుంది. జిల్లా కేంద్రంలోని జి ఆర్ కాలనీ పర్యటించిన అనంతరం భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, చెరువులు, కుంటలు కలెక్టరేట్లో ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించనున్నారు. లింగంపేట ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట్ నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు దెబ్బతిన్న ప్రాంతాలను కేంద్ర బృందం పరిశీలించనుంది. కేంద్ర బృందం తో పాటు జిల్లా అధికారులు, వ్యవసాయ శాఖ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, తదితర శాఖల అధికారులు వారి వెంట ఉన్నారు.