న్యూఢిల్లీ: కరూర్‌లో జరిగిన తొక్కిసలాట(Karur stampede) ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలన్న మద్రాస్ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తమిళ నటుడు విజయ్ రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం(Vijay TVK Party) సుప్రీంకోర్టును(Supreme court) ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. టీవీకే కార్యదర్శి ఆదవ్ అర్జున ద్వారా దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారణకు జాబితా చేయాలని న్యాయవాది చేసిన వాదనలను ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయ్, న్యాయమూర్తి కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తును నిరాకరిస్తూ, సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ బీజేపీ నాయకురాలు ఉమా ఆనందన్ దాఖలు చేసిన పిటిషన్‌ను అక్టోబర్ 10న విచారించేందుకు మంగళవారం ధర్మాసనం అంగీకరించింది.