calender_icon.png 8 October, 2025 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడ్లూరి లక్ష్మణ్ మనసు నొచ్చుకొని ఉంటే చింతిస్తున్నా

08-10-2025 11:41:02 AM

మంత్రి అడ్లూరితో వివాదంపై మంత్రి పొన్నం విచారం వ్యక్తం 

హైదరాబాద్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం స్పందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనకు సోదర సమానులని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్లుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మించినదే అన్నారు. తమ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పుడూ అలాగే కొనసాగిందని, ఇద్దరి మధ్య అనుబంధం ఎవరు విడదీయరానిదని మంత్రి పొన్నం(Minister Ponnam Prabhakar) పేర్కొన్నారు. తాను అడ్లూరి లక్ష్మణ్ పై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని, అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా, తనకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదని వివరించారు.

అయితే, రాజకీయ దురుద్దేశంతో కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించి, వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారని ఆరోపించారు. దాంతో ఏర్పడిన అపార్థాల వల్ల అన్నలాంటివారు అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మనసు నొచ్చుకుందని తెలిసి తీవ్రంగా విచారిస్తున్నానని పేర్కొన్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మనసు నొచ్చుకొని ఉంటే చింతిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయం సాధనలో, ప్రజల అభ్యున్నతికై తామిద్దరం కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు. పొన్నం ప్రభాకర్ కామెంట్స్‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ స్పందించారు. పొన్నం ప్రభాకర్ ప్రకటనపై సంతృప్తి చెందని తెలిపారు. చింతిస్తున్నా అనడం కంటే పొరపాటు జరిగింది అంటే బాగుండేదన్నారు. పొన్నం మాట్లాడిన మాటలు రాష్ట్రం అంతా చూసిందని అడ్లూరి లక్ష్మణ్‌ స్పష్టం చేశారు.