నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం నిర్ణయం
- ఉమ్మడి జిల్లాలో 5 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానం పెరిగే అవకాశం
మారనున్న రాజకీయ సమీకరణలు
కరీంనగర్, మార్చి 24 (విజయ క్రాంతి): దేశంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను.. 2011 జనాభా లెక్కల ఆధారంగా జరిపించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే లోక్సభలో, రాష్ట్రాల శా సన సభల్లో మహిళలకు 33 శాతం కోటా క ల్పించే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని కూడా 2011 జనాభా లెక్కల ఆధారంగా అమలు చే సేందుకు సిద్ధమైనది.
నియోజకవర్గాల పెం పు ప్రక్రియ అమలైతే తెలంగాణ రాష్ట్రాము లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు 179కి.. లోక్ సభ స్థా నాలు 17 నుంచి 26కి పెరిగే అవకాశం ఉం ది. ఈ పెరుగుదల వల్ల క్షేత్రస్థాయిలో కొత్త నాయకత్వం ఉద్భవించడమే కాకుండా ఎ స్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కోటా కూడా గణనీయం గా పెరగనుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 13 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానా లు ఉండగా అసెంబ్లీ స్థానాలు 17 లేదా 18 కి పార్లమెంటు స్థానాలు 3 కు చేరుకుంటా యి.
కరీంనగర్ అసెంబ్లీ కరీంనగర్ అర్బన్, రూరల్ గా, పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి, సుల్తానాబాద్ గా రామగుండం అర్బన్ రూరల్ అసెంబ్లీ గా అయ్యే అవకాశం ఉంది. జగిత్యాల జిల్లాలో ఒక నియోజకవర్గం, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలలో కలిపి మరో ని యోజకవర్గం, అలాగే హుజురాబాద్ నియోజకవర్గం హుజురాబాద్, జమ్మికుంటలుగా ఏర్పడే అవకాశం ఉంది. ఒక్కో నియోజకవర్గంలో రెండు లక్షల జనాభా కు తగ్గకుండా విభజన చేస్తారు. ప్రస్తుతం ఉన్న కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ తో పాటు కొత్తగా జగిత్యాల ఏర్పడే అవకాశం ఉంది.
తిరిగి కలిపే ప్రతిపాదన...
హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో కలపడం పై మం త్రి పొన్నం ప్రభాకర్ పట్టుబడుతున్నారు. గత ప్రభుత్వం ప్రజల అభీష్టానికి విరుద్ధంగా హుస్నాబాద్ ను సిద్దిపేటలో కలిపిందని.. శాస్త్రీయంగా సరిహద్దులు మార్చినప్పుడు దీనిని పాత జిల్లాలోనే చేరుస్తామని మంత్రి ఇప్పటికే భరోసా ఇచ్చారు. ఇదే క్రమంలో వంగర కేంద్రంగా ‘పి.వి. నరసింహారావు జి ల్లా’ ఏర్పాటు చేయాలని ప్రజలు ధర్నాలు చేస్తున్నారు.
పూర్వ కరీంనగర్ జిల్లా నుండి హన్మకొండలో కలిసిన భీమదేవరపల్లి, ఎ ల్కాతుర్తి లను కలిపి పి వి జిల్లా తెరమీదికి వచ్చింది. పరిపాలనను సులభతరం చేసేలా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల, జిల్లా ల పునర్విభజన ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు.




