1 August, 2026 | 6:08 PM

Breaking News

విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తున్న ప్రభుత్వం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి   •   సోనాల మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు   •   అనురాగ్ లో కెరీర్ క్యాటలిస్ట్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఫర్ ప్లేస్మెంట్ సక్సెస్ వర్క్ షాప్   •   గోదావరి ఉధృతి.. జలదిగ్బంధంలో బూర్గంపాడు   •   వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •   ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం   •  

నేడు స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్

29-10-2024 02:58 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి): డీఎస్సీ 2024 ఎస్‌జీటీ, స్పెషల్ ఎడ్యుకేషన్ 1:3 లిస్టులోని అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను మంగళవారం నిర్వహిం చబోతున్నట్లు హైదరాబాద్ డీఈవో ఆర్ రోహిణి తెలిపారు. నాంపల్లిలోని ఎల్బీ స్టేడియం ఎదుట గల మోడల్ ఆలియా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు.

1:3 అభ్యర్థుల జాబితాను dcebhy derabad. webnode.in వెబ్‌సైట్‌లో పొం దుపర్చినట్లు చెప్పారు. అభ్యర్థులు రెండు పాస్‌ఫొటోలు, అన్ని సర్టిఫికెట్లు ఒరిజినల్, జిరాక్స్(గెజిటెడ్ అటెస్టెడ్) కాపీలతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని పేర్కొన్నారు.