25 April, 2026 | 10:02 PM

జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్‌లో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రధానం

25-04-2026 08:20 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని నాగారం సెంటర్‌లో జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇచ్చే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నమనేని విద్యాసాగర్ రావు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, మహిళా సాధికారతతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు.

సమాజ పురోగతికి మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగారం కేంద్రంలో శిక్షణ పొందిన నర్సింగ్ మరియు కుట్టు శిక్షణ విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోవడంతో కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో సెంటర్ మేనేజర్ మొయ్య మహేష్, జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సిబ్బంది, ప్రతిమ ఫౌండేషన్‌కు చెందిన గీతారెడ్డి, కౌశిక్, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.