calender_icon.png 15 November, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతీ శుభోదయం ఇంగ్లీష్ మీడియం స్కూల్‌

15-11-2025 08:31:16 PM

చాచా నెహ్రూ జయంతి వేడుకలు

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లిలోని సరస్వతీ శుభోదయం ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జవహర్లాల్ నెహ్రూకు పిల్లలపై అపారమైన మమకారం ఉండడంతోనే ఆయనను పిల్లలు చాచా నెహ్రూ అని పిలుస్తారని ఉపాధ్యాయులు, విద్యార్థులకు వివరించారు.

స్కూల్ కరస్పాండెంట్ ఏం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... నేటి బాలలే రేపటి భారత భవిష్యత్ పౌరులు, సమాజ నిర్మాతలు. డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు వంటి ప్రతి విభాగంలోనూ నిలుస్తున్న ప్రతిభావంతులు విద్యార్థుల నుంచే వస్తారని తెలిపారు. విద్యను అభ్యసించి, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అజయ్, డీఈఓ పి. సాత్విక్, ప్రిన్సిపాల్ వినూత్న గౌడ్, కరస్పాండెంట్ గౌరీ ప్రణయ్, ప్రిన్సిపాల్ మాధవి లతా రెడ్డి, ప్రీ-ప్రైమరీ ఇంచార్జ్ పద్మశ్రీతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.