15-11-2025 08:28:54 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు గ్రామ శివారులోని గోదావరి నది ఒడ్డున జిల్లా అబ్కారీ టాస్క్ ఫోర్స్ ఎస్సై గౌతమ్, తన బృందంతో కలిసి దాడులు నిర్వహించారు. కాగా నాటు సారా తయారీకి ఉపయోగించే 15 డ్రమ్ముల తవుడు-పంచదార పానకాన్ని (750 లీటర్లు) స్వాధీన పర్చుకుని సంఘటన స్థలం నందే పారబోసి, డ్రమ్ములు ధ్వంసం చేసి కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ ఎస్ఐ గౌతమ్ తెలిపారు. ఈ తనిఖీల్లో డిటిఎఫ్ సిబ్బంది రామకృష్ణ గౌడ్, గురవయ్య, సుమంత్, రమేష్ పాల్గొన్నారు.