calender_icon.png 19 January, 2026 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్! దుమ్ము.. దుమ్ము అయిపోతావ్!

19-01-2026 12:59:22 PM

హైదరాబాద్: సింగరేణి టెండర్ల(Singareni Tenders) కోసం మంత్రులు గొడవపడ్డారని తెలిపారు. మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు(Former Minister MLA Harish Rao) ఆరోపించారు. సింగరేణి నైనీ గనుల టెండర్లపై(Singareni Naini mines tenders) సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఆయన. బీజేపీతో రేవంత్ రెడ్డి కుమ్మక్కు కాకపోతే సీబీఐ విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు. విచారణకు ఆదేశిస్తే ఆధారాలు సమర్పిస్తామని సూచించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన వెనుక కుట్ర ఉందన్నారు. బీజేపీకి, రేవంత్ రెడ్డికి సంబంధం లేకపోతే, నైనీ బ్లాక్ టెండర్ల రద్దు మీద తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని బీజేపీని, కిషన్ రెడ్డిని(Kishan Reddy) హరీష్ రావు డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ జోలికోస్తే.. రేవంత్ గద్దెలు కూలుస్తాం

తెలంగాణలో బీఆర్ఎస్ గద్దెలు కూల్చలన్న రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యలపై హరీశ్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ గద్దెల జోలికోస్తే రేవంత్ గద్దెలు కూలుస్తామని హెచ్చరించారు. దుమ్ము.. దుమ్ము అయిపోతావ్ అన్నారు. బీఆర్ఎస్ గద్దెలలో లేన్న హరీశ్ రావు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉందన్నారు. మాయ మాటలు బంద్ చేసి ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని సూచించారు. టీడీపీపై ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఎందుకు చేరారు? అని హరీశ్ ప్రశ్నించారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితమైతే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందని వెల్లడించారు.