బోధన్ గ్రంథాలయాన్ని సందర్శించిన చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి
29-07-2026 12:00 AM
బోధన్,జులై 28 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని గ్రంథాలయాన్ని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠకులతో, విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీంతో విద్యార్థులు కొన్ని పుస్తకాలు కావాలని కోరడంతో రెండు రోజులలో పుస్తకాలను సమకూరుస్తానని చైర్మన్ హామీనిచ్చారరు. త్వరలో గ్రంథాలయం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తూము శరత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తలారీ నవీన్ తదితరులు ఉన్నారు.






