29 July, 2026 | 12:57 AM

పీహెచ్‌సీ తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ

29-07-2026 12:00 AM

గుమ్మడిదల, జూలై 28: జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ లలితా దేవి మంగళవారం పి హెచ్ సి గుమ్మడిదలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవల పైన వాటికి సంబంధించిన రికార్డుల పైన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు అందుతున్న సేవలను రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. స్థానిక వైద్యాధికారి డాక్టర్ మధుకర్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.