పైప్ లైన్ వేసేందుకు అధికారులకు సూచనలు ఇచ్చిన చైర్మన్ రాధాకృష్ణ
24-03-2026 05:51 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ఆదేశాల మేరకు అమృత్ 2.0 ప్లాన్లో భాగంగా పెరిక గిద్ద హనుమాన్ టెంపుల్ దగ్గరలో గల మెయిన్ ట్యాంక్ నుండి సబ్ ట్యాంకులకు పైప్ లైన్ ఏ విధంగా వేయాలనే దానిపై మున్సిపల్ కమిషనర్ రమేష్ కు, ఏఈ కి అలాగే అమృత్ కాంట్రాక్టర్స్ కి మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ మంగళవారం పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అవార్డు కౌన్సిలర్ రాజు. కౌన్సిలర్లు వర ప్రదీప్. ఈర్ల స్వరూప శేఖర్ పాల్గొన్నారు.




