8 August, 2026 | 7:34 PM

ఆదివాసులకు అడవి యే అమ్మ... అమాయకత్వమే ఆభరణం

08-08-2026 06:29 PM

* ఆగస్టు 9న  ప్రపంచ ఆదివాసి దినోత్సవం..

ఉట్నూర్,(విజయక్రాంతి): అడవిని అమ్మలా చూసి  దైవంలో ఆదరిస్తారు ఆదివాసి గిరిజనులు.. అందుకే వీరిని అడవి బిడ్డలుగా మేధావులు పేర్కొంటారు.. అమాయకత్వమే ప్రాణంగా విరాజిల్లుతున్న  నిష్వార్త జీవి ఆదివాసి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఐటిడిఏ పరిధిలోని ఆదివాసుల జీవితాలలో గతంలో కొంతమేర అభివృద్ధి వెలుగులు వచ్చిన చీకట్లో తొలగలేదు.

ప్రతి మూడు నెలలకు ఒకసారి  ఐటిడిఏ పాలకవర్గ మండల సమావేశాలను నిర్వహించాల్సి ఉండగా   ఆరు సంవత్సరాలుగా   ఐటిడిఏ పాలకవర్గ సమావేశాలు నిర్వహించడం లేదు. గిరిజన అభివృద్ధికి  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులతోపాటు  గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం  తీసుకునే  సంక్షేమ పథకాలపై ఐటిడిఏ పాలకవర్గ సమావేశంలో  సభ్యులు  ఏకగ్రీవంగా తీర్మానం చేసి   అమలు చేసే అధికారం పాలకమండలి సమావేశానికి ఉంది. కానీ పాలకులు మాత్రం ఐటిడిఏ పాలకవర్గ సమావేశంపై   ఎలాంటి శ్రద్ధ చూపడం లేదు.

* పాలకమండలి నిర్వహణపై  పట్టింపేది..? 

 గిరిజనుల సంక్షేమం కోసం  ప్రతి మూడు నెలలకు ఒకసారి  జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పాలకవర్గ సమావేశాన్ని  నిబంధనల ప్రకారం నిర్వహించాలి. కానీ 2019 ఆగస్టు 30 తేదీన  ఆఖరు పాలకవర్గ సమావేశాన్ని  నిర్వహించారు. అప్పటినుండి  ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని  నిర్వహించడం లేదు. ఉట్నూర్ ఐటిడిఏ పరిధిలోని  ఏజెన్సీ ప్రాంతంలో ఆదిమ గిరిజనూలు అయినా కొలం, తోటి చెందిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన  ఇందిరమ్మ ఇండ్లను  ప్రత్యేకంగా మంజూరు చేశారు.

ఈ ఇంటి నిర్మాణాలు అడవి ప్రాంతంలో  చేపట్టిన గిరిజనులకు  ఇంటి నిర్మాణంలో చేయవద్దని   అడవి శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. అడవి శాఖ అధికారులతో  తన పోరాటమని  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కొనసాగిస్తున్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా పాలకవర్గాలు ఐటీడీఏ పాలకవర్గా సమావేశాన్ని ఏర్పాటు చేసి   ఆదిమ గిరిజనులు  ఎదుర్కొంటున్న  పోడు భూముల సమస్యతో పాటు  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం  పై చర్చించి గిరిజనుల అభివృద్ధికి బాటలు వేయాలని గిరిజనులు కోరుతున్నారు.