29 August, 2026 | 2:41 AM

సినిమా పేరు.. ‘చకోర లూనార్ లవ్ బర్డ్’

29-08-2026 01:53 AM

శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న సినిమా ‘చకోర- లూనార్ లవ్ బర్డ్’. ఈ చిత్రాన్ని వీఐపీ వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ సారథ్యంలో హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ డాక్టర్ చింతాడ హేమారావు నిర్మిస్తున్నారు. ‘చకోర- లూనార్ లవ్ బర్డ్’ సినిమాతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ వద్ద ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మంగా శ్రీనివాస్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

అక్టోబర్ 8న ఈ సినిమా గ్రాండ్ థియేటర్ రిలీజ్‌కు రాబోతున్నది. ‘చకోర- లూనార్ లవ్ బర్డ్’ సినిమా ఆడియోను ప్రముఖ ఆడియో లేబుల్ టి సిరీస్ రిలీజ్ చేయబోతున్నది. ఇప్పటిదాకా తెలుగు తెరపై వచ్చిన ప్రేమ కథలకు భిన్నమైన లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త లవ్ ఫీల్‌ను పంచనున్నది. త్వరలో ‘చకోర- లూనార్ లవ్ బర్డ్’ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ను మేకర్స్ వెల్లడించనున్నారు.