మా నాన్నతో కలిసి తాగుతా..!
‘మా నాన్నతో కలిసి మందు తాగుతా..’ అంటూ బోల్డ్ కామెంట్స్‌తో సెగలు రేపుతోంది గ్లామర్ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ! టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ కన్నడ కస్తూరి తాజాగా చేసిన బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
తన గ్లామర్‌తోనే కాకుండా, తన మనసులోని మాటలను ఏమాత్రం దాచుకోకుండా ఓపెన్‌గా చెప్పేస్తూ కుర్రకారుకు మరింత దగ్గరవుతోందీ మంగళూరు ముద్దుగుమ్మ. ప్రసన్న వదనం, అలా నిన్ను చేరి, చౌర్యపాఠం, పాపం ప్రతాప్.. ఇలా పలు తెలుగు సినిమాలతో మెప్పించిన ఈ అమ్మడు వరుసగా సినిమాలు, సిరీస్‌లతో టాలీవుడ్‌లో బిజీగా ఉంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ త్వరలో ‘హ్యాపీ జర్నీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాయల్ రాధాకృష్ణ తన పర్సనల్ లైఫ్, అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా డ్రింకింగ్‌పై ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.
“నేను సిగరెట్లు అస్సలు తాగను. కానీ, లిక్కర్ మాత్రం మా నాన్నతో కలిసి ఇంట్లోనే తాగుతా. అసలు నాకు మొదటిసారి డ్రింక్ ఆఫర్ చేసింది కూడా మా నాన్నే. ఎప్పుడు తాగాలనిపించినా బయట పబ్‌లకు వెళ్లకుండా, నాన్నతో కలిసి ఇంట్లోనే ప్రశాంతంగా తాగుతా. అయితే నాకు దానిపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, అప్పుడప్పుడు మాత్రమే తాగుతా” అని తెలిపింది. ఇక తన తండ్రితో ఉన్న బాండింగ్ గురించి చెప్తూ ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడింది పాయల్. ‘ఈ రోజుల్లో చాలామంది ఫెమినిజం గురించి మాట్లాడుతున్నారు. కానీ మా నాన్న ఎప్పుడో ఫెమినిస్ట్‌గా ఉండి, నాకెంతో స్వేచ్ఛను ఇచ్చారు. ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి’ అంటూ తన తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకుంది.






