calender_icon.png 22 September, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చల్మెడ వలసవాది కాదు.. ప్రాంతీయ వాది

22-09-2025 12:00:00 AM

చెల్మెడపై విమర్శలు సరి కాదు..

కోనరావుపేట సెప్టెంబర్ 21 (విజయక్రాంతి):వేములవాడ బి ఆర్‌ఎస్ నాయకులు చల్మెడ లక్ష్మీనరసింహారావు వలసవాది కాదని ప్రాంతీయ వాది అని టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య అన్నారు ఆదివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 25 సంవత్సరాలు పార్టీలో ఉండి పార్టీ వీడి నాయకుని పై విమర్శించడం.

స్థాయికి మించి మాట్లాడడమేనని 10 సంవత్సరాల బిఆర్‌ఎస్ పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి చేశారని గత ప్రభుత్వంలో మంజూరైన పనులను మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు చెబుతున్నారని యూరియాతో రైతులు ఇబ్బంది పడితే పట్టించుకోవడంలేదని గత 25 సంవత్సరాలు పార్టీలో ఉండి పార్టీకి వెన్నుపోటు పొడిచిన సింగల్ చైర్మన్ బండ నరసయ్య చల్మెడపై ఆరోపణలు చేయడం సరైనది కాదని ఇకనైనా నీ స్థాయికి మించి మాట్లాడితే టిఆర్‌ఎస్ నాయకులు ఊరుకోరని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, మాజీ ఎంపీపీ చంద్రయ్య గౌడ్ మాజీ సింగల్ విండో చైర్మన్ రామ్మోహన్ రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు గోపు పరశురాములు, సింగల్ విండో వైస్ చైర్మన్ భూమిరెడ్డి, నాయకులు కేందగంగాధర్, శివతేజ రావు, జీవన్ గౌడ్, రత్నాకర్, ఆరె మహేందర్, ప్రతాపరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్,సూర్య నాయక్, వంగపల్లి శ్రీనివాస్ జగన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.