22-09-2025 12:00:00 AM
మహబూబాబాద్, సెప్టెంబర్ 21(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో శ్రీ మాత వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీ వాసవి మిత్ర మండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన శ్రీ దేవి శరన్నవరాత్రి షోడశ వార్షిక ఉత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు సుమారు 30 మంది ఆదివారం వరంగల్ లోని శ్రీ భద్రకాళి ఆలయంలో భవాని దీక్ష ధారణ చేపట్టారు.
ఈ ఉత్సవాల నిర్వహణే ధ్యేయంగా తీసుకున్న దీక్ష ఆదివారం తో ప్రారంభమై విజయదశమి రోజుతో ముగియనుంది. అక్టోబర్ 3న అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర కేసముద్రం లోపూర్తి చేసుకొని విజయవాడలో ని కృష్ణా నది లో అమ్మవారి నిమజ్జనం అనంతరం ఈ దీక్ష విరమణ చేయడం జరుగుతుంది.
నవరాత్రులలో జరిగే విశేష పూజల్లో పాల్గొన వలసిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరాం చంద్రన్ కుమార్, వోమ సంతోష్, మాలె రవి ,సామ ప్రకాశ్, రాపోలు శ్రీనివాస్, భోగోజు వేణుగోపాల్, రాపాక కుమారస్వామి, కముటం శ్రీనివాస్, ఉమేష్, శశాంక్, తదితరులు పాల్గొన్నారు.