1 June, 2026 | 12:54 PM

Breaking News

గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు   •   మున్సిపాలిటీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరణ   •   డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చలో కలెక్టరేట్ పాదయాత్ర ప్రారంభం   •   ఉరుమడ్ల గ్రామంలో ఎమ్మెల్యే వేముల వీరేశం జన్మదిన వేడుకలు   •   అగ్నివీర్ కు ఎంపికైన అచ్చంపేట యువకుడు   •   World Milk Day: పాల ధర తగ్గి, ఖర్చులు పెరిగి డైరీ రైతులు నష్టాల్లో   •   ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై తెలంగాణ CID బిగ్ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్   •   బిగ్ షాక్... మరోసారి పెరిగిన సిలిండర్ ధరలు.. ఎంతంటే?   •   సీఎం పర్యటన బందోబస్తుపై పోలీసు అధికారులకు ఎస్పీ నితికా పంత్ బ్రీఫింగ్   •  

డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చలో కలెక్టరేట్ పాదయాత్ర ప్రారంభం

01-06-2026 12:23 PM

పాదయాత్రను ప్రారంభించిన మాజీ మంత్రి సబితా ఇంత్రారెడ్డి

షాద్ నగర్,(విజయక్రాంతి): కొత్తూరు మండలం సిద్ధపూర్ లో ఏర్పాటు చేయతలు పెట్టిన డంపింగ్ యార్డ్(Dumping Yard) వ్యతిరేకంగా సోమవారం నాడు కలెక్టరేట్ కార్యక్రమం పాదయాత్ర మొదలైంది. సిద్దాపూర్ గ్రామంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Former Minister Sabitha Indra Reddy) ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నేతృత్వంలో డంపింగ్ యార్డ్ వ్యతిరేకంగా మొదలుపెట్టిన చలో కలెక్టరేట్ పాదయాత్ర కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు(BRS Cadres) భారీగా పాల్గొన్నారు దీనికి తోడు డంపింగ్ యార్డ్ వ్యతిరేక ఉద్యమానికి ప్రత్యేకంగా ఏర్పాటైన జేఏసీ నేతలు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్(Shadnagar Former MLA Anjaiah Yadav) మాట్లాడుతూ పంపింగ్ ఆడు ఏర్పాటుకు వ్యతిరేకంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పాదయాత్రను కలెక్టరేట్ వరకు కొనసాగిస్తామని తెలిపారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఐటీ టవర్ల నిర్మాణం కోసం  భూమిని కేటాయిస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం  చెత్త డంపు యార్డుకు కేటాయిస్తారా అంటూ  ఆయన ప్రశ్నించారు. డంపు యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే అంతవరకు నిరసనలు కొనసాగుతాయని ఈ సందర్భంగా జేఏసీ నేతలు స్పష్టం చేశారు