ఆగస్టు 23న చలో హైదరాబాద్
సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ (ఓపీఎస్)విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న జనజాగరణ బస్సు యాత్ర శనివారం భద్రాద్రి నుంచి ప్రారంభమైందని, దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించినట్లు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధానకార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ తెలిపారు. ఆగస్టు 23న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వేలాది మంది సీపీఎస్ ఉద్యోగులతో భారీగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
33 జిల్లాల ప్రజాప్రతినిధులకు వినతిపత్రాల అందజేత కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్యతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఈ మేరకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపా రు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగునాయక్, తుక్కాని శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్, సురే ష్ తదితరులు పాల్గొన్నారు.






