టీఆర్పీలో నూతన నియామకం
రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మహిళా చైర్‌పర్సన్‌గా పుష్పలీల నియామకం
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మహిళా విభాగం చైర్‌పర్సన్‌గా ఇరుకుల్ల పుష్పలీలను రాష్ట్ర క్రమశిక్షణ కమి టీ చైర్మన్ బందారపు నర్సయ్య గౌడ్ నియమించారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కా ర్యాలయంలో శనివారం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పుష్పలీలకు నియామక పత్రాన్ని అందజేసి అభి నందనలు తెలిపారు.
పార్టీ సిద్ధాంతాలు, విలువలకు అనుగుణంగా పనిచేస్తూ మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తానని ఇరుకుల్ల పుష్పలీల ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్, మహిళా విభా గం ప్రధాన కార్యదర్శి బత్తిని మీనా గౌడ్ పాల్గొన్నారు.
మల్లన్నను కలిసిన వట్టె జానయ్య
టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఇటీవల న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్నను హైదరాబాద్‌లోని కార్యాలయంలో మర్యాదపూర్వ కంగా కలిశారు. జానయ్యను తీన్మార్ మల్లన్న సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నీరజ గౌడ్ పాల్గొన్నారు.






