16 April, 2026 | 11:54 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఛలో రాజ్ భవన్ ముట్టడిని జయప్రదం చేయండి

21-06-2025 02:35 AM

 ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చేపూరి కొండలు 

చిలుకూరు, జూన్ 20 : ఈనెల 23న, ఏఐవైఎఫ్  ఆధ్వర్యంలో జరిగే ఆపరేషన్ కంగార్ ను ఆపాలని ఛలో రాజ్ భవన్ ముట్టడిని జయప్రదం చేయాలని,  ఏఐవైఎఫ్  జిల్లా ప్రధాన కార్యదర్శి చేపూరి కొండలు పిలుపునిచ్చారు. చిలుకూరు మండల కేంద్రంలోని దొడ్డ నరసయ్య, భవన్లో శుక్రవారం రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏఐ వైఎఫ్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి చేపూరి కొండలు మాట్లాడుతూ,  ఒకవైపు విప్లవ పార్టీ చర్చలకు సిద్ధమని కాల్పుల విరమణ పాటిస్తామని ప్రకటించిన ప్రభుత్వం మాత్రం తుపాకీతోనే పరిష్కరిస్తామనడం అమానీయం అని ఆయన అన్నారు.    ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ చిలుకూరు మండల అధ్యక్షులు అనంతుల రాము, బాలే  బోయిన  మహేష్, మాధవరపు చిన్న వెంకటి,షేక్ నాగుల్, కాంపాటి రంజిత్ కుమార్, వి,అశోక్ కుమార్, సిహెచ్, వినోద్,అజయ్, కాజా, తదితరులు పాల్గొన్నారు.