23 July, 2026 | 1:50 AM

హక్కుల సాధన కోసం ఛలో సూర్యాపేట

23-07-2026 12:00 AM

 కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు రేణుబాబు 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూలై 22: తమ హక్కుల సాధన కోసం ఈ నెల 26న జిల్లా కేంద్రం సూర్యాపేట లోని కుమ్మరి సంఘం భవనంలో జరిగే సమావేశానికి జిల్లాలోని అన్ని గ్రామాల కుమ్మరి వృత్తిదారులు హాజరై విజయవంతం చేయాలని కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు కంభంపాటి రేణుబాబు పిలుపునిచ్చారు.

బుధవారం మండల కేంద్రం అర్వపల్లిలో ఆ సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమ్మరి హక్కుల పరిరక్షణతో పాటు,వృత్తిదారుల సమస్యలపై,ప్రభుత్వ పథకాల అమలుపై జరిగే సమావేశానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం జిల్లా నాయకులు కోటమర్తి శ్రీనివాస్,సలిగంటి వీరేందర్,శ్రీనివాస్,నిమ్మనగోటి మధు,మారపాక రాములు, మల్లయ్య, వెంకన్న,నవీన్ తదితరులు పాల్గొన్నారు.