23 July, 2026 | 1:49 AM

సేంద్రియ వ్యవసాయంపై మొగ్గుచూపండి

23-07-2026 12:00 AM

డీఏఓ బాబురావు

పలిమేల. జులై 22 (విజయక్రాంతి )ఎలినిఓ ప్రభావంవల్ల వర్షాలు లేని కారణంగా రైతులు సేంద్రియ వ్యవసాయం పై మొగ్గుచూపాలని జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు అన్నారు. బుధవారం పలిమేల మండల కేంద్రంలో సేంద్రియ వ్యవసాయం పై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎలినిఓ ప్రభావం తో వర్షాలు తక్కువ పడే అవకాశం ఉండటం వలన అరుతడి పంటలు సాగు, సేంద్రియ వ్యవసాయం పై రైతులకు అవగాహన కల్పించారు. పలిమేలలో ఏర్పాటు చేసిన ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాన్ని డి ఏ ఓ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ జవ్వాజి పుష్పలత. మండల వ్యవసాయ అధికారి సంపత్, ఏ ఈ ఓ శరత్, ఆగ్రోస్ రమేష్ రెడ్డి, రైతులు పాల్గోన్నారు.