1 August, 2026 | 6:09 PM

Breaking News

తల్లిపాలు బిడ్డకు అమూల్యమైన వరం   •   విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తున్న ప్రభుత్వం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి   •   సోనాల మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు   •   అనురాగ్ లో కెరీర్ క్యాటలిస్ట్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఫర్ ప్లేస్మెంట్ సక్సెస్ వర్క్ షాప్   •   గోదావరి ఉధృతి.. జలదిగ్బంధంలో బూర్గంపాడు   •   వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •  

భైరాన్‌పల్లిలో చాళుక్యుల నాటి శిల

16-02-2025 12:00 AM

సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని భైరాన్‌పల్లిలో పురాతన శిల ఉంది. గ్రామంలోని పురాతన జైన ఆలయంలో ఈ శిల బయటపడింది. శిలను పరిశీలించిన చరిత్రకారులు అది చాళుక్యుల కాలం నాటిదని,  ఈ శిల జైన చౌముఖి శిల్పం అని, ఐదు అడుగుల ఎత్తుతో చెక్కారని పేర్కొన్నారు. నలువైపులా ఉన్న శిల్పాలు 24వ జైన తీర్థంకరుడు మహావీరుడి ధ్యానం చేస్తున్నట్లుగా ఉన్నాయి.

గతంలో ఈ తరహా శిల్పాలు కొలనుపాక, వేములవాడలో బయటపడ్డాయి. జైనులు వీటిని ‘సర్వతోభద్ర’ అంటూ వ్యవహరిస్తారు. బౌద్ధుల తరహాలోనే జైనులు కూడా స్తూపాలు నిర్మించుకు నేవారని, గ్రామంలోని అంగడి వీరన్న శివాలయం ముందున్న శాసనాల ద్వారా తెలుస్తోంది.