19 June, 2026 | 2:24 AM

చాంపియన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్

19-06-2026 01:01 AM

సుబ్రతో కప్ ఫుట్‌బాల్ టోర్నీ

హైదరాబాద్, జూన్ 18: యువ ప్లేయర్స్ కోసం సీఐఎస్‌సీఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏపీ,తెలంగాణ ప్రీ సుబ్రతో కప్ ఫుట్‌బాల్ టోర్నీ అండర్ 17 బాలుర విభాగంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట్) విజేతగా నిలిచింది. తొలి సెమీస్‌లో హెచ్‌పీసీ నాసర్ స్కూల్‌ను ఓడించగా.. రెండో సెమీస్‌లో సెయింట్ ప్యాట్రిక్ హైస్కూల్ షేర్వ్‌డ్ పబ్లిక్ స్కూల్‌పై గెలిచింది. అయితే ఫైనల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అదరగొట్టింది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం కనబరిచింది.

టైటిల్ పోరు లో సెయింట్ ప్యాట్రిక్ హైస్కూల్‌పై హెచ్‌పీసీ  4 గోల్స్ తేడాతో విజయం సాధిం చింది. హెచ్‌పీసీ తరపున దన్యాల్, అబ్దుల్ కలామ్(2 గోల్స్) అభిరామ్ గోల్స్ సాధించారు. గచ్చిబౌలీ నాసర్ పబ్లిక్ స్కూల్ ఈ పోటీలకు ఆతిథ్యమిస్తుండగా అండర్ 15,అండర్ 17 బాలుర, బాలికల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. నాసర్ బాయ్స్ స్కూల్ ప్రిన్సిపల్ మీర్ హఫిజుద్దీన్ అహ్మద్ ముగింపు వేడుకలకు హాజరై టైటిల్ గెలిచిన హెచ్‌పీసీ జట్టు ఆటగాళ్లను అభినందించారు.