27 August, 2026 | 6:20 AM

15 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ

19-06-2026 01:03 AM

బీహార్ మహిళా క్రికెటర్ సంచలనం

చరిత్ర సృష్టించిన అక్షర గుప్తా

బీహార్‌కు చెందిన అక్షర గుప్తా 15 ఏళ్ల వయసులోనే అండర్-19 మహిళల వన్డే క్రికెట్‌లో 126 బంతుల్లో 306 పరుగులు చేసి ట్రిపుల్ సెంచరీ సాధించింది. ఈ ఇన్నింగ్స్‌తో ఆమె వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది.

భగల్‌పూర్, జూన్ 18 : భారత క్రికెట్‌లో బిహార్ నుంచి చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ దూసుకొచ్చి కొన్ని నెలలైనా గడవకముందే మహిళల క్రికెట్‌లో సైతం అదే రాష్ట్రం నుంచి ఓ అమ్మాయి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. 15 ఏళ్ళకే ట్రిపుల్ సెంచరీ సాధించింది. అండర్ 19 మహిళల వన్డే క్రికెట్‌లో దూసుకొస్తున్న అక్షర గుప్తా తాజాగా చరిత్ర సృష్టించింది.

మరిన్ని తాజా స్పోర్ట్స్ అప్‌డేట్స్ కోసం Sports News ఫాలో అవ్వండి

126 బంతుల్లో 306 పరుగులతో వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. కేవలం 126 బంతుల్లో 242.86 స్ట్రుక్‌రేట్‌తో 306 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 55 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 34 బంతుల్లో సెం చరీ పూర్తి చేసుకుంది. భారత దేశవాళీ మహిళా క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ముంబైకి చెందిన ఇరా గుప్తా పేరిట ఉంది. ఆమె 346 పరుగులతో అజేయంగా నిలిచింది. 

మరిన్ని బ్రేకింగ్ న్యూస్ కోసం మా విజయక్రాంతి న్యూస్‌ హోమ్‌పేజీని ఫాలో అవ్వండి.

Q: అక్షర గుప్తా ఎన్ని పరుగులు చేసింది?
👉 126 బంతుల్లో 306 పరుగులు చేసింది.

Q: ఆమె వయసెంత?
👉 కేవలం 15 ఏళ్లు.

Q: ఈ రికార్డ్ ఎందుకు ప్రత్యేకం?
👉 చిన్న వయసులో ట్రిపుల్ సెంచరీ చేయడం అరుదైన విషయం.

Q: అక్షర గుప్తా ఎక్కడి వారు?
👉 బీహార్‌కు చెందిన యువ క్రికెటర్.

Q: ఎంత స్ట్రైక్‌రేట్‌తో ఆడింది?
👉 242.86 స్ట్రైక్‌రేట్‌తో.