18 July, 2026 | 7:08 PM

Breaking News

నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •  

ఎన్టీఆర్ చిత్రంలో ఛాన్స్!

28-11-2024 12:34 AM

‘సప్తసాగారాలు దాటి’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ రుక్మిణి వసంత్‌కు మంచి కాలం వచ్చినట్టుంది. ఈ భామ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘కాంతార’ ప్రీక్వెల్‌లో నటిస్తోంది. శివకార్తికేయన్, మురుగదాస్ కాంబో చిత్రంలోనూ అవకాశం కొట్టేసింది. తాజాగా టాలీవుడ్‌లో ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది.

ఇప్పటికే చిత్రబృందం అమ్మడిని సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. అగ్రిమెంట్‌పై సైన్ చేయడమూ పూర్తయిందట. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ప్రస్తు తం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్‌తో షూటింగ్‌కు సిద్ధమవుతాడని తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో సినిమా అవకాశం కొట్టేయడంతో రుక్మిణి ఆనందానికి అవధుల్లేవు.