18 July, 2026 | 6:22 PM

Breaking News

అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •   ఎస్ఐఆర్ శిబిరాన్ని సందర్శించిన శ్రావణి రాకేష్   •   పోలీసులకు ప్రజా దర్బార్   •   మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటిన బిఆరెస్వి నాయకులు.   •   బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం   •   వ్యవసాయంపై దిశానిర్దేశం   •   మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •  

అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి

18-07-2026 06:22 PM

నిర్మల్(విజయక్రాంతి): ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ శనివారం పరిశీలించారు. నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ కూచాడి శ్రీహరి రావు, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి నిర్మల్ పట్టణంలోని గాజులపేట్, బుదవార్పేట్, బంగాల్పేట్, బెస్తవార్పేట్, గులజార్ మార్కెట్, బాగులవాడ, భాగ్యనగర్లను సందర్శించారు.

సర్ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు), కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు)తో సమావేశమై ఓటరు నమోదు, పేర్ల చేర్పులు, మార్పులు, తొలగింపులు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఎలాంటి అర్హులైన ఓటరు జాబితా నుంచి మినహాయింపుకు గురికాకుండా ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా ఎస్‌ఐఆర్ ప్రక్రియను చేపట్టాలన్నారు.