calender_icon.png 18 July, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదక్‌లో చందనబ్రదర్స్ షాపింగ్‌మాల్ ప్రారంభం

18-07-2025 12:33:17 AM

  1. సందడి చేసిన సినీనటి వైష్ణవిచైతన్య 
  2. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

మెదక్, జూలై 17 (విజయక్రాంతి): మెదక్ ప్రజలు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సీబీఎస్ (చందన బ్రదర్స్ షాపింగ్ మాల్) ప్రారంభోత్సవం జన సందోహం మధ్య ఘనంగా జరిగింది. సీబీఎస్ షాపింగ్‌మాల్‌ను ప్రముఖ సినీనటి వైష్ణవిచైతన్య ప్రారంభించారు. అనంతరం సినీనటి వైష్ణవిచైతన్య మాట్లాడుతూ అందరికీ అందుబాటు ధరలలో వనస్టాప్ మాల్ సీబీఎస్ (చందన బ్రదర్స్ షాపింగ్ మాల్)ను మెదక్‌లో ప్రారంభించబడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

తాను సీబీఎస్ (చందన బ్రదర్స్ షాపింగ్ మాల్) ప్రారంభోత్సవంలో భాగం కావడం ఎంతో సంతోషకరమన్నారు. ఎందుకంటే ప్రతి చిన్న అవసరానికి, అది ఇంట్లో ఏ ఫంక్షన్లకైనా, షూటింగ్ కాస్ట్యూమ్‌లకైనా తాము మొదటిగా వెళ్లేది సీబీఎస్ (చందన బ్రదర్స్ షాపింగ్ మాల్) కేనని, ఇక్కడ లభించే డిజై న్లూ, వెరైటీలూ వేరెక్కడా లభించవని, అందుకే ఇది హైదరాబాదీల ఫేవరిట్ షోరూంగా మారిందని అన్నారు.

షోరూం మేనేజింగ్ డైరెక్టరు జానా సురేష్ మాట్లాడుతూ 40 సంవత్సరాల అనుబం? సంస్థ తెలుగు రాష్ట్రాలలో ప్రారంభించిన ప్రతి చోటా అతి తక్కువ కాలంలోనే అక్కడి ప్రజల మన్ననలతో నెం.1 షోరూంగా నిలుస్తుండడం తమకు ఎంతో ఉత్సాహాన్ని కల్గించదన్నారు. మరిన్ని ప్రదేశాలలో ప్రారంభించాలనే ప్రోత్సాహాన్ని అంది స్తుందన్నారు.

మెదక్ ప్రజల అభిరుచికి సరిపడే వస్త్రాలు ఎంపిక చేయడంలోగాని,  షో రూం తీర్చిదిద్దడంలో ఇక్క?  ప్రత్యేక శ్రద్ధ పెట్టడంవలన ఇక్కడి కస్టమర్ల అభిమానాన్ని మ రింత వేగంగా పొందుతామనడంలో తమకు అపారమైన నమ్మకముందని తెలియజేసారు. అన్ని ఆదాయ వర్గాలకూ అందుబాటు ధరలలో నాణ్యమైన సంప్రదాయ వస్త్రాలను, మోడ్రన్ ఫ్యాషన్లనందించడంలో మరింత ముందుటామని, అదే తమ విజయరహస్యమని తెలియజేసారు.

సీబీఎస్ ప్రారంభో త్సవం, ఆషాడం, శ్రావణ మాసం వేడుకల సందర్భంగా అన్ని రకాల వస్త్రాలపై  తగ్గింపు ధరలతో మా కస్టమర్స్‌కు అందిస్తున్నామని తెలిపారు. ఇక మొదటిగా తామే షాపింగ్ చేయాలని వచ్చిన కస్టమర్ల ఆనందానికైతే హద్దేలేకుండా పోయింది.

ముఖ్యంగా స్త్రీల సంతోషం పట్టనలవి కాకుండా ఉంది. ప్రారంభోత్సవ ఆఫర్లతో అతి తక్కువ ధరలతో ఉన్న చీరలను చూసి మురిసిపోతూ షాపింగ్ బుట్టలలో చీరలను నింపేయడం ప్రతి ఫ్లోర్‌లోనూ కనిపించింది. ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే  మైనంపల్లి హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.