calender_icon.png 18 July, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ రాజ్యంలో సాకారమైన పేదల సొంతింటి కల

18-07-2025 12:33:44 AM

మేడిపల్లి జూలై 17; రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీల నకు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ మేయర్ అమర్ సింగ్, పార్టీ నాయకులతో కలిసి పిజ్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 14వ డివిజన్ లో గల ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పేదవాడు సంతోషంగా ఉండే లా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నా రు, ప్రతి ఒక్కరి జీవితం అభివృద్ధి బాటలోకి రావాలని ఒక్క కుటుంబం కూడా వెనుక ప డకూడదనే లక్ష్యంతో ప్రతి పేద కుటుంబాలు తమకంటూ ఒక ఇంటి కళను సహకారం చేసుకొనే దిశగా ముందడుగు వేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పిజ్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, మాజీ డిప్యూటీ మే యర్ కుర్ర శివకుమార్ గౌడ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, పిజ్జాది గూడ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప న్నాల శ్రీనివాస్ రెడ్డి, 14వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బుచ్చి యాదవ్, పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కనకదుర్గ, మాజీ కార్పొరేటర్లు , పార్టీ నాయకు లు, కాలనీవాసులు తదితరులుపాల్గొన్నారు.