calender_icon.png 9 May, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనపర్తిలో చందన బ్రదర్స్ షోరూం

18-07-2024 12:53:56 AM

ప్రారంభించిన సినీ నటి వైష్ణవి చైతన్య

వనపర్తి, జూలై 17 (విజయక్రాంతి): చందన బ్రదర్స్ హైదరాబాద్ వారు వనపర్తి జిల్లా కేంద్రంలో నూతన షోరూమ్‌ను ప్రారంభించారు. బుధవారం ప్రముఖ సినీనటి వైష్ణవి చైతన్య ముఖ్యఅతిథిగా హాజరై ఈ షోరూంను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి, జడ్పీచైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మహేశ్‌తోపాటు చందన బ్రదర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. తమ వద్ద పట్లు ఫ్యాన్సీ చీరలతోపాటు అన్ని రకాల వస్త్రాలు సరసమైన ధరలకే అందుబాటులో ఉన్నాయని యాజమాన్యం తెలిపింది. ఆకర్షణీయమైన బంగారు నగలు, వెండి వస్తువులు కూడా ఉన్నాయని వెల్లడించింది. బంగారు, వెండి వస్తువులపై మజూరి చార్జీలు లేవని పేర్కొంది.