పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా
మున్సిపల్ చైర్మన్ మింగ్రే ఆకాష్
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ మింగ్రే ఆకాష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థి అయిన ఆయనను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ... తాను చదువుకున్న పాఠశాలలోనే మున్సిపల్ చైర్మన్‌గా సన్మానం పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
వేసవి కాలంలోపే పాఠశాలలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు బోర్‌వెల్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి శక్తి మేరకు కృషి చేస్తానని తెలిపారు. గతంలో పాఠశాలలో విధులు నిర్వహించి పదోన్నతి పొంది బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు నాగరాణి, ఉమారాణిని శాలువాలతో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనిత, ఉపాధ్యాయులు శ్రావణ్, గంగాధర్ రెడ్డి సన్మానించారు.




