పదవ తరగతి జీవితానికి తొలిమెట్టు
జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): పదవ తరగతి ప్రతి విద్యార్థి జీవితానికి తొలి మెట్టుకొని జిల్లా మధుసూదన్ నాయక అన్నారు. జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శనివారం పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కాగా జిల్లా కేంద్రంలో ఎం.జి. రోడ్డులో నున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష రాస్తున్న విద్యార్థులకు బెస్ట్ విషెస్ తెలిపారు.
ఈ సందర్భంగా పరీక్షా సరళిని పరిశీలించారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలైన తాగునీరు, ప్రథమ చికిత్స మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మూత్ర శాలలు, మరుగుదొడ్లు, తరగతి గదుల్లో వెంటిలేషన్ తదితర ఏర్పాట్లు ఉండాలన్నారు. ఎక్కడా ఎలాంటి చిన్న పొరపాట్లకు అవకాశం లేకుండా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. తొలుత వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ప్రశ్నా పత్రం డిస్ట్రిబ్యూషన్ తనిఖీ చేసి సూచనలు చేశారు.అదనపు కలెక్టర్ వెంట డి.ఈ.ఓ ప్రవీణ్ కుమార్ ఉన్నారు




