29 April, 2026 | 10:23 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

మాల్తుమ్మెద గ్రామ నర్సరీని కామారెడ్డి డిపిఓ మురళి

14-03-2026 02:52 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ నర్సరీని శనివారం కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి మురళి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నర్సరీలో ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు. ఎండాకాలం సందర్భంగా మొక్కలకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో మొక్కలకు సరిపడా నీటిని అందించాలని, నాటిన ప్రతి మొక్కను కాపాడాలన్నారు. గ్రామాలలో చేపడుతున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక  పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకుండా సక్రమంగా నిర్వహించాలని పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ కార్యక్రమంలో పూర్తి కావాలన్నారు.

గ్రామాలలో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు.గ్రామాలలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలని తెలిపారు.గ్రామాలలో క్రమం తప్పకుండా పారిశుద్ధ పనులు చేపట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ ప్రభాకర్ చారి, గ్రామ సర్పంచ్ పుప్పాల సాయిలు, వదలపర్తి పోచారం గ్రామాల సర్పంచులు సత్యబోయిన పద్మ నారాయణ, సంజీవరావు, పంచాయితీ కార్యదర్శులు అశోక్ కుమార్, భాస్కర్, అజ్ముద్దీన్, ఫీల్డ్ అసిస్టెంట్లు నర్సింలు, సాయిలు స్వప్న తదితరులు పాల్గొన్నారు.