1 June, 2026 | 2:46 AM

చందాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక

01-06-2026 01:51 AM

తాడ్వాయి, మే, 31 (విజయక్రాంతి): కా మారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చందా పూర్ గ్రామంలో ఆదివారం నాయకులు కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఎన్నుకు న్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ముద్దు మైపాల్, ఉపాధ్యక్షుడిగా గడ్డం సాయి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గద్దరాజు సందయ్య, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నరేష్, బీసీ సెల్ అధ్యక్షుడిగా రాజయ్య, మైనార్టీ అధ్యక్షుడిగా నాసిర్ అహ్మద్, కాంగ్రెస్ కిసాన్ విభాగం అధ్యక్షుడిగా అడ్డి స్వామి, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా రమేష్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారి సంజీవులు, ఇన్చార్జి షౌకత్ అలీ, నాయకులు సుధాకర్ రావు, మేకల రాజు తదితరులు పాల్గొన్నారు.